గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 జులై 2022 (10:11 IST)

స్కూల్ బ్యాగులో లవ్ లెటర్ పెట్టాడు.. తల్లిదండ్రులు చితక్కొట్టారు..

Saipallavi, kolukolu song
ఫిదా ఫేమ్ సాయిపల్లవి నటించిన విరాటపర్వం సినిమా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా బాల్యంలో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్‌ను సాయిపల్లవి అభిమానులతో పంచుకున్నారు. ఒక లవ్ లెటర్ వల్ల బాల్యంలో తాను ఇబ్బంది పడ్డానని తాను ఇబ్బంది పడటంతో తల్లీదండ్రులు కొట్టారని ఆమె చెప్పుకొచ్చారు. 
 
నెట్ ఫ్లిక్స్ మై విలేజ్ షోలో పాల్గొన్న సాయిపల్లవి బాల్యంలో తనకు ఎదురైన అనుభవాల గురించి పంచుకున్నారు. తాను ఏడో తరగతి చదివే సమయంలో తల్లీదండ్రులు తనను కొట్టారని సాయిపల్లవి చెప్పుకొచ్చారు.
 
ఏడో తరగతి చదివే సమయంలో ఒక అబ్బాయి తన స్కూల్ బ్యాగులో లవ్ లెటర్ పెట్టాడని.. అది తాను గమనించలేదని చెప్పింది. అయితే నా తల్లీదండ్రులు ఆ లేఖను చూశారని సాయిపల్లవి వెల్లడించింది. ఆ సమయంలో పేరెంట్స్ తనను చాలా కొట్టారని తెలిపింది. 
 
సాయిపల్లవి చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సాయిపల్లవి నటించిన గార్గి సినిమా మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది.