సోమవారం, 20 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : గురువారం, 7 జులై 2022 (20:24 IST)

స‌స్పెన్స్‌ను క్రియేట్ చేసిన సాయిప‌ల్ల‌వి గార్గి ట్రైల‌ర్‌

Sai Pallavi, Gargi
Sai Pallavi, Gargi
సాయిప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర పోషించిన చిత్రం గార్గి. ఈ చిత్రాన్ని రానా ద‌గ్గుబాటి స‌మ‌ర్పిస్తున్నారు. గౌత‌మ్ రామ‌చంద్ర‌న్ ద‌ర్శ‌కుడు. టికెట్ ప్యాక్ట‌రీ బేన‌ర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం జూలై 15 థియేట‌ర్‌లో విడుద‌ల‌కానుంది. ఈ సంద‌ర్భంగా గురువారంనాడు సోష‌ల్‌మీడియాలో గార్గి చిత్ర ట్రైల‌ర్ రానా విడుద‌ల చేశారు.
 
ఇందులో ఏముందంటే.. గార్గి తండ్రిని అక‌స్మాత్తుగా పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఎందుకు చేస్తారో ఆమెకూ తెలీదు. అస‌లు నువ్వు ఏంచేస్తుంటావ‌ని ఓ పోలీసు అడుగుతాడు. టీచ‌ర్ అని చెబుతుంది.   ఆ త‌ర్వాత పోలీసులు ఇంటికి వ‌చ్చి మీడియాకు తెలీయ‌క‌ముందే ఇల్లువిడిచి వెళ్ళిపోమంటారు పోలీసులు. ఆ త‌ర్వాత‌ తండ్రిని చూడ్డానికి వెళ్ళినా చూడ‌నీయ‌రు. ఓ లాయ‌ర్ వ‌చ్చి గార్గి తండ్రి త‌ర‌ఫున వాదిస్తానంటాడు. ఇలా సాగుతున్న ట్రైల‌ర్‌లో ఓ సామాజిక అంశాన్ని ట‌చ్ చేసిన‌ట్లుగా ముగింపు ఇచ్చాడు ద‌ర్శ‌కుడు. మ‌రి రానా ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నాడంటే పెద్ద విశేషం. రానా, సాయిప‌ల్ల‌వి విరాట‌ప‌ర్వం చేశారు. అందులో ఆమె న‌ట‌న‌కు రానా ఫిదా అయిపోయాడు.