గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 జూన్ 2022 (21:47 IST)

లేడీ పవర్ స్టార్ బిరుదుపై సాయిపల్లవి కామెంట్ ఏంటి?

love story sai pallavi
లేడీ పవర్ స్టార్ బిరుదుపై సాయిపల్లవి స్పందించింది. పేరుకు ముందు ఇలాంటి బిరుదులు వేసుకునేందుకు ఇష్టపడనని క్లారిటీ ఇచ్చింది. అలాంటి వాటికి తాను కనెక్ట్ కానని చెప్పింది. బిరుదులు మనపై ఒత్తిడి పెంచేస్తాయి. 
 
ప్రేక్షకులు తనను ప్రేమించడానికి, అభిమానించడానికి తనను చేసిన పాత్రలే కారణం. కాబట్టి ఇంకా మంచి పాత్రలు చేసి వాళ్ళ ప్రేమను పొందాలని కోరుకుంటాను. బిరుదులు ఉంటే సరిగా నటించలేను. కాబట్టి సాధారణంగానే ఉండటానికి ఇష్టపడతానని సాయిపల్లవి చెప్పుకొచ్చింది. 
 
సాయి పల్లవిగా పిలిపించుకోవడమే తనకిష్టం అని ఆమె పరోక్షంగా తెలియజేశారు. తాజాగా సాయి పల్లవి అనుకోని వివాదంలో చిక్కుకున్నారు. కాశ్మీర్ ఫైల్స్ మూవీ గురించి సాయి పల్లవి తన అభిప్రాయం చెప్పగా కొందరు ఖండించారు. ఆమెపై విమర్శల దాడికి దిగారు.