సోమవారం, 20 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 6 జులై 2022 (16:13 IST)

మా నీళ్ల ట్యాంక్ వెబ్ సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తోన్న ప్రియా ఆనంద్‌

Priya Anand,
Priya Anand,
శేఖర్ కమ్ముల- రానా ద‌గ్గుబాటి కాంబినేష‌న్లో రూపొందిన లీడర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ ప్రియా ఆనంద్. ఆ సినిమాలో త‌న అందం, అభిన‌యంతో చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మంచి స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత రామ రామ కృష్ణ కృష్ణ, కో అంటే కోటి, 180 సినిమాల‌తో న‌టిగా మెప్పించింది. కొంత గ్యాప్ త‌ర్వాత ఈ భామ మ‌ళ్లీ త‌న అభిమానుల్ని అల‌రించ‌నుంది.
 
వ‌రుడు కావలెను సినిమాతో మంచి హిట్ సాధించిన లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో `మా నీళ్ల ట్యాంక్` అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో రూపోందుతున్న వెబ్ సిరీస్ లో న‌టిస్తోంది ప్రియా ఆనంద్‌. ఒక చిన్న గ్రామంలో పనికిరాని వాటర్ ట్యాంక్‌ చుట్టూ నడిచే కథతో, సరదా సరదా సన్నివేశాలతో ఈ వెబ్ సిరీస్ తెర‌కెక్కింది. జీ5 సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుశాంత్‌ సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌గా నటిస్తుండగా, పల్లెటూరు అమ్మాయిగా ప్రియా ఆనంద్ కనిపిస్తోంది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ వెబ్‌ సీరిస్‌ జులై 15 నుంచి జీ 5లో స్ట్రీమింగ్‌ కాబోతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది. ఈ వెబ్ సిరీస్ కోసం ప్రియా సొంతంగా డ‌బ్బింగ్ చెప్పింది. ఈ టీజ‌ర్లో ప్రియా ఆనంద్ న‌ట‌న‌ను ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె కుమార్ మెచ్చుకోవ‌డం విశేషం.