సోమవారం, 11 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 14 జూన్ 2022 (21:40 IST)

నాకు కాబోయేవాడు ఇంకా పుట్ట‌లేదు - సాయిప‌ల్ల‌వి (video)

Saipallavi
Saipallavi
న‌టి సాయిప‌ల్ల‌వి గురించి అంద‌రికీ తెలిసిందే. ఆమె డేట్స్ కోసం సినిమాలు ఆపి మ‌రీ ఆమె ఫ్రీ అయ్యాక సినిమాలు తీసేవారు. ఫిదాలో శేఖ‌ర్ క‌మ్ముల స్టేట్‌మెంట్ కూడా అదే. అలాగే నాగ‌చైత‌న్య‌తో ల‌వ్‌స్టోరీ, ఇప్పుడు తాజాగా `విరాట‌ప‌ర్వం` చిత్రం కూడా అంతే. మ‌ధ్య‌లో కొన్ని క‌థ‌లు ఆమె డేట్స్ లేకపోవ‌డంతో వేరేవారికి వెళ్ళిన సంద‌ర్భాలున్నాయి. 
 
ఆమ‌ధ్య సాయిప‌ల్ల‌వి మేరేజ్ విష‌యంలో రూమ‌ర్లు వ‌చ్చాయి. త్వ‌ర‌లో పెండ్లి చేసుకోబోతున్న‌ట్లు కూడా ఓ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వూలో వెల్ల‌డించింది. కాగా, ఆమె ఎక్కువ‌గా తెలంగాణా నేప‌థ్యం వున్న సినిమాల్లో న‌టిస్తోంది. ఇదే విష‌యాన్ని ఆమె ముందు ప్ర‌స్తావిస్తే.. ఇంటిలోకూడా ఇది మ‌న‌పిల్ల‌కాదు. మ‌న ఫ్యామిలీలా ప్ర‌వ‌ర్తించ‌డంలేదు. అంతా తెలంగాణా పిల్ల‌గా మారిపోయిందంటూ త‌ల్లి,తండ్రి కామెంట్ చేస్తున్నార‌ని చెప్పేసింది. విరాట‌ప‌ర్వంలో ఓ స‌న్నివేశంలో దేవుడిని పూజించే విధానం ద‌ర్శ‌కుడు వేణు కుడుముల వివ‌రిస్తుండ‌గా, నాకు తెలుసులే అంటూ ఆటోమేటిక్‌గా చేసేశాను. దానికి అంద‌రూ షాక్ అయ్యారంటూ. ఇంత క‌రెక్ట్‌గా ఎలా చేయ‌గ‌లిగారంటూ.. అడిగార‌ని చెప్పింది. అయితే గ‌త జ‌న్మ‌లో ఇక్క‌డ పుట్టివుంటానంటూ న‌వ్వుతూ చెప్పింది.
 
మ‌రి మీలైఫ్ పార్ట‌న‌ర్ ఇక్క‌డివాడేనా! మ‌రెక్క‌డైనా వున్నాడా? అన్న ప్ర‌శ్న‌కు ఆమె కాస్త ఘాటుగానే స్పందించింది. నాకు కాబోయేవాడు ఇంకా పుట్ట‌లేదంటూ.. చ‌మ‌త్కారంగా చెప్పింది. ఏదిఏమైనా అంతా పైవాడే మ‌న గురించి రాస్తాడు. అందుకే తెలుగులో సినిమాలు చేసి పేరు సంపాదిస్తున్నానంటూ క్లారిటీ ఇచ్చింది.