ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 జూన్ 2022 (14:50 IST)

పుష్ప నటనతో బాలీవుడ్‌కు శ్రీవల్లి.. అంతా సామి సామి మాయే..!

Rashmika Madanna
Rashmika Madanna
పుష్ప హీరోయిన్ రష్మిక మందన్న యానిమల్ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. పుష్పలో రష్మిక నటన, శ్రీవల్లిగా ఆమె పాత్ర ఆమెను రాత్రికి రాత్రే స్టార్‌ను చేసేసింది. 
 
పుష్పలోని 'సామి సామి'  స్టెప్ అదిరిపోయింది. ఇప్పటికీ సోషల్ మీడియాలో అత్యంత ట్రెండీ స్టెప్. పుష్పలో రష్మిక అద్భుతమైన నటన కారణంగా, రణ్‌బీర్ కపూర్‌తో పాటు సందీప్ రెడ్డి వంగా యానిమల్ కోసం రష్మిక మందనను తీసుకున్నారు.
 
ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ "పుష్పలో నా నటన చూసిన తర్వాత యానిమల్ మేకర్స్ ఈ సినిమా కోసం నన్ను సంప్రదించారు. ఈ చిత్రానికి అవును అని చెప్పే ముందు నేను ఒకటికి రెండుసార్లు ఆలోచించలేదు, ఎందుకంటే ప్రేక్షకులు నా యొక్క కొత్త వైపును ఆస్వాదిస్తారనే నమ్మకం నాకు ఉంది " అని రష్మిక తెలిపింది. 
 
తన అందం, తేజస్సు, ప్రతిభ కారణంగా రష్మిక నేడు భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన నటులలో ఒకరు. ఆమెకు నేషనల్ వైడ్‌గా క్రష్ వున్న హీరోయిన్. ప్రస్తుతం రణబీర్ కపూర్ సరసన యానిమల్, సిద్ధార్థ్ మల్హోత్రా సరసన మిషన్ మజ్నులో కనిపించనుంది.