సంబంధిత వార్తలు
- డీఎండీకే పార్టీ అధినేత విజయ్‌కాంత్‌కు సర్జరీ.. కుడికాలి వేలు తొలగింపు
- జులై 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఏమైపోతానే చిత్రం
- Vijayawada Municipal Corporation: బిల్డర్లకు టౌన్ ప్లానింగ్ అధికారులే అక్రమంగా లైసెన్సులు ఇస్తున్నారా? ఫ్లాట్స్ కొనుక్కున్న వారి పరిస్థితి ఏంటి?
- హీరో విజయ్ పార్టీ ఆఫీస్ పరిసరాల్లో మృతదేహం.. చేతిలో, నోట్లో పరోటా!
- తడిసి ముద్దయిన విజయవాడ - ఏకధాటిగా కురిసిన వర్షం
దళపతి విజయ్ వారసుడు ఫస్ట్ లుక్
Varasudu first look
అన్ని వర్గాల ప్రేక్షలని ఆకట్టుకునే చిత్రాలను రూపొందించే ప్రతిభగల దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమా కోసం యూనివర్సల్ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నారు. ఈ చిత్రానికి తమిళంలో 'వారిసు' టైటిల్ ని ఖరారు చేశారు. ఈ చిత్రం కోసం బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్‌ను తయారు చేసిన దర్శకుడు వంశీపైడిపల్లి విజయ్‌ని మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేయనున్నారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రస్తుతం చెన్నైలో సినిమా కోర్ టీమ్ పై కీలకమైన భారీ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో చాలా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
భారీ నిర్మాణ విలువలతో లావిష్ అండ్ విజువల్ గ్రాండియర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్ ప్లేను అందించారు.
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా, శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సహ నిర్మాతలుగా, సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా పని చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తారాగణం: విజయ్, రష్మికా మందన్న, శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, శామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త తదితరులు
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: వంశీ పైడిపల్లి
కథ, స్క్రీన్ ప్లే: వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా
సహ నిర్మాతలు: శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత
సంగీతం: ఎస్ థమన్
డీవోపీ: కార్తీక్ పళని
ఎడిటింగ్: కెఎల్ ప్రవీణ్
డైలాగ్స్, అడిషనల్ స్క్రీన్ ప్లే: వివేక్
ప్రొడక్షన్ డిజైనర్లు: సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి
ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: బి శ్రీధర్ రావు, ఆర్ ఉదయ్ కుమార్
మేకప్: నాగరాజు
కాస్ట్యూమ్స్: దీపాలి నూర్
పబ్లిసిటీ డిజైన్స్: గోపి ప్రసన్న
వీఎఫ్ఎక్స్: యుగంధర్
