గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 జూన్ 2022 (11:47 IST)

హీరో విజయ్ పార్టీ ఆఫీస్ పరిసరాల్లో మృతదేహం.. చేతిలో, నోట్లో పరోటా!

vijay
కోలీవుడ్ స్టార్ హీరో  విజయ్ పార్టీ ఆఫీస్ పరిసరాల్లో ఓ వ్యక్తి మృతదేహాం వెలుగులోకి రావడం అందరికీ షాకిచ్చింది. వివరాల్లోకి వెళితే.. విజయ్ అభిమానులు 'విజయ్ మక్కల్ ఇయక్కం' అనే పార్టీని స్థాపించి, వాళ్లే దాన్ని కార్యకలపాలు చూసుకుంటున్నారు. 
 
చెన్నైలో ఉన్న పనైయూర్‌లో ఆ పార్టీ భవనం ఉంది. ప్రస్తుతం ఆ పార్టీ బిల్డింగ్‌ను రెనోవేషన్ చేసే క్రమంలో ప్రభాకరన్ అనే కాంట్రాక్ట్ ఉద్యోగిని అపాయింట్ చేసుకున్నారు. 
 
కొద్ది రోజుల క్రితం కుటుంబ సభ్యులను చూసేందుకు వెళ్లిన ప్రభాకరన్.. గురువారం రాత్రి తాను పనిచేస్తున్న భవనం వద్దకు వచ్చాడట. శుక్రవారం ఉదయం అయ్యేసరికి ప్రభాకరన్ అనుమానాస్పదస్థితిలో శవమై కనిపించాడు. అతని చేతిలో, నోట్లో పరోటా ఉండడం అందరినీ భయాందోళనకి గురి చేసింది. 
 
స్థానికులు పోలీసులకి సమాచారం అందించగా..వాళ్ళు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తుంది. పోస్ట్ మార్టం నిమిత్తం వారు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది. 
 
ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే… ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ బైలింగ్యువల్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2023 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.