మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 ఆగస్టు 2022 (16:03 IST)

వివాదాస్పద వ్యాఖ్యలు .. సినీ ఫైట్ మాస్టర్ అరెస్టు

arrest
వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో సినీ ఫైట్ మాస్టర్ కణల్ కన్నన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను పుదుచ్చేరిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయన తమిళ సినీ స్టంట్ మాస్టర్‌గానే కాకుండా, హిందూ మున్నని ఆర్ట్ అండ్ కల్చర్ వింగ్ తమిళనాడు అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. 
 
ఆయన అరెస్టుకుగల కారణాలను పరిశీలిస్తే, తిరుచ్చి శ్రీరంగం ఆలయం వెలుపల ఉన్న పెరియార్ విగ్రహంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు కోసం పోలీసులు ప్రయత్నించగా ఆయన అక్కడ లేకపోవడంతో వడపళని, వలసరవాక్కంలలో కూడా గాలించారు. అక్కడకూడా ఆయన ఆచూకీ తెలియకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోగా, ఆయన కోసం పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఈ నేపథ్యంలో ఆయన పుదుచ్చేరిలో ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి అరెస్టు చేశారు. అక్కడ నుంచి చెన్నైకు తీసుకెళ్లారు.