కాంగ్రెస్ పార్టీలో చేరనున్న హీరోయిన్ త్రిష?
టాలీవుడ్ సీనియర్ నటి త్రిష కృష్ణన్ రాజకీయాల్లోకి రావడానికి వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళ నటుడు విజయ్ నటిని రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.
'వర్షం' సినిమాతో మంచి గుర్తింపు పొందిన త్రిష ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కించిన ఎపిక్ పీరియడ్ యాక్షన్ డ్రామా పొన్నియిన్ సెల్వన్‌లో ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 30న వెండితెరపైకి రాబోతోంది.
తన క్యూట్ స్మైల్‌తో, యాక్టింగ్ స్కిల్స్‌తో చాలా మంది హృదయాలను కొల్లగొట్టిన త్రిష ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తమిళంలో మాత్రం అడపాదడపా చిత్రాల్లో నటిస్తున్నారు.