'కురువి' కాంబో మళ్లీ రిపీట్.. విజయ్, త్రిషల రొమాన్స్
2008లో వచ్చిన 'కురువి' తరువాత ఇద్దరి కాంబినేషన్ తర్వాత త్రిష-విజయ్‌ల సినిమా రానుంది. అంటే 14 ఏళ్ల తరువాత మళ్లీ ఇద్దరూ జోడీ కడుతున్నారన్నమాట. తెలుగులో గ్యాప్ వచ్చినా త్రిష పట్ల ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదనే చెప్పాలి.
ఇక తెలుగులో 'నాయకి' తరువాత త్రిష మళ్లీ తెరపై కనిపించలేదు. తమిళంలో నాయిక ప్రధానమైన సినిమాలతో బిజీగానే ఉంది. మణిరత్నం భారీ ప్రాజెక్టులోను మంచి పాత్రను దక్కించుకుంది. ఈ సినిమా సీక్వెల్‌లోను ఆమె పాత్రకి ప్రాధాన్యత ఉందని టాక్ వస్తోంది.
తాజాగా విజయ్ సినిమా కోసం ఆమెను తీసుకున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ 'వారసుడు' సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. 'మాస్టర్' తరువాత విజయ్‌తో లోకేశ్ చేస్తున్న సినిమా ఇది గమనార్హం.