జూనియర్ సమంతలా జూనియర్ త్రిష వచ్చేసింది..!
అషూ రెడ్డి. జూనియర్ సమంతగా అషూ రెడ్డి ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. బిగ్ బాస్‌కు కూడా వెళ్లింది. ఇప్పుడు బుల్లితెరపై సెలబ్రెటీ హోదాలో ఉంది. తాజాగా జూనియర్ త్రిష వచ్చేసింది. 40 ఏళ్లకు అడుగు దూరంలో ఉన్న సీనియర్ బ్యూటీ త్రిష.. ఇప్పటికీ తిరుగులేని ఫాలోయింగ్‌తో దూసుకెళ్తుంది.
తాజాగా హీరోయిన్ త్రిషని పోలిన ఓ అమ్మాయి ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ అమ్మాయి పేరు దీపికా విజయ్. అచ్చం త్రిషలా ఉన్న ఈ అమ్మాయి త్రిష కంటే కాస్త సన్నగా ఉంటారు. అచ్చం త్రిషని పోలిన ఈ అమ్మాయి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అష్షు రెడ్డి సోషల్ మీడియా ద్వారా ఎంత ఫేమస్ అయి ఇప్పుడు నానా రచ్చ చేస్తుందో అలానే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా త్రిషని పోలిన వ్యక్తి రచ్చ చేస్తుంది.
ఈ జూనియర్ త్రిష కూడా ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతుంది. త్రిషలా ఉన్న దీపికా విజయ్ కర్నాటక రాష్ట్రం మైసూర్‌కు చెందిన అమ్మాయిగా తెలుస్తోంది.