గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 3 ఆగస్టు 2022 (22:19 IST)

పాలిటిక్స్ లేవు - నేను ఎప్పుడూ యాక్టర్‌నే - నిఖిల్‌

Nikhil, chandu and others
Nikhil, chandu and others
అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఆగస్ట్ 13న విడుదల కానుంది కార్తికేయ 2. హీరో నిఖిల్ తాజా సినిమా కార్తికేయ‌2. ఈ చిత్రం ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఆయ‌న ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించారు. రాజ‌కీయాల‌గురించి, సినిమా గురించి ప‌లు ప్ర‌శ్న‌ల‌కు  జ‌వాబులు వివ‌రించారు. చిత్ర యూనిట్ కూడా మాట్లాడారు.
 
లాస్ట్ ఇయర్ లో వై యస్ ఆర్ కాంగ్రెస్ (వై.కా.పా) కు సపోర్ట్ చేశారు.. ఇప్పుడు కూడా మీరుbవై.కా.పా లో వున్నారా?
 
హీరో నిఖిల్.. నాకు పార్టీ పాలిటిక్స్ అంటూ ఏమీ లేవు.. నేను ఎప్పుడూ యాక్టర్ నే.. అయితే అప్పుడు నాకు తెలిసిన వారు పోటీ చేయడంతో ప్రచారం చేశాను. అంతే కాదు అంతకుముందు  కూడా నాకు తెలిసిన వారు పోటీ చేస్తే నేను తెలుగుదేశం, జనసేన  లకు కూడా ప్రచారం చేశాను తప్ప నేను సినిమానే ప్రపంచం.
 
ప్రెస్ మీట్ అనంతరం పాత్రికేయులు అడిగిన  ప్రశ్నలకు  సమాధానాలు తెలియజేశారు
 
"కార్తికేయ" పార్ట్ 1 లో హీరోయిన్ గా స్వాతి రెడ్డి, ఇప్పుడు పార్ట్ 2 లో  అనుపమ ను తీసుకోవడానికి గల కారణమేంటి?
దర్శకుడు చందు .... కార్తికేయ  2 లో స్వాతికి పాత్ర కు ఎక్కువ స్కోప్ లేదు.అందుకే స్వాతిని తీసుకోలేదు. ఉదాహరణ కు ఇండియనా జోన్స్ చుడండి  పార్ట్ 1 లో ఉన్న  హీరోయిన్ పార్ట్ 4 లో వస్తుంది.ఆలా ఈ మూవీ స్టోరీ లో స్వాతి లేదు.
 
అర్జున్ సురవరం కు కూడా డేట్స్ మారుతూ వచ్చింది. చివరికి అది హిట్ అయింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని రావడానికి కారణమేంటి ? గ్యాప్ వచ్చినా ఈ సినిమాకు కూడా డేట్స్ మారాయి. అది మీకు సెంటిమెంట్ అనుకుంటున్నారా?
 
హీరో నిఖిల్ ..నాకు తెలిసి ఫిలిం ఇండస్ట్రీ లో ఏ యాక్టర్ కు ఇలా ఉండదు.గండం వస్తే సక్సెస్ అవుతుంది సెలబ్రేట్ చేసుకుంటాను అనుకోలేదు.అయితే నాకు కూడా ఇదినిజమేనోమో అనిపిస్తుంది. "ఎక్కడికి పోతావు చిన్నవాడా" కూడా ఆఫ్టర్ డిమాటైజేషన్ తర్వాత వచ్చిన ఫస్ట్ సినిమా అది మాకు బిగ్ హడల్. అర్జున్ సురవరం తరువాత నేను సినిమా చేయకపోవడానికి ముఖ్య  కారణం. ప్యాండమిక్ అందుకే సినిమా సినిమా చేయలేకపోయాం. ఆ సినిమా హిట్ తరువాత  మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని  "కార్తికేయ 2" కొరకు వెయిట్ చేసి ఈ సినిమా చేయడం జరిగింది.
 
అనుపమ ఖేర్ ను తీసుకురావడా నికి కారణమేంటి?
దర్శకుడు చందు.. కథ హిమాచల్ ప్రదేశ్ లో నడుస్తున్నంది.  అక్కడి వారు అయితే బాగుంటుంది అకున్నాము. అయితే అభిషేక్ గారికి బాగా పరిచయం ఉండడంతో వారి ద్వారా అప్రోచ్ అయ్యి బాలీవుడ్ యాక్టర్ అనుపమ ఖేర్ ను తీసుకోవడం జరిగింది.
 
ఓటిటి లో కాకుండా థియేటర్ కె వెళ్లి చూడాలనే  ప్రామినెంట్స్ ఈ సినిమాలో ఏమున్నాయి?
 
హీరో నిఖిల్.. ఈ సినిమా డిజైనింగ్ లోనే థియేటర్ వచ్చి చూడాలని ప్లాన్ చేసుకున్నాము. కృష్ణుడు గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సినిమా తీస్తే గ్రాండ్ వే లో అన్నమయ్య, దేవుళ్ళు వంటి సినిమాలు వచ్చేవి ఆ సినిమాలకు ఫ్యామిలీ మొత్తం థియేటర్ వచ్చి సినిమా చూసే వారు.. ఇప్పుడు ఎవరూ ఆలా రావడం లేదని మంచి భక్తి తో పాటు అడ్వెంచర్ తో పాటు  థ్రిల్ ఉండాలని ఈ సినిమా తీయడం జరిగింది. అందరూ థియేటర్ లో చుడండి కచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారు.
 
కార్తికేయ పార్ట్ 1లో యానిమిల్ హిప్నాటిజం చూయించారు. ఇందులో అది ఉంటుందా? అలాగే ఇందులో కృష్ణ తత్త్వం చూయించడానికి రీజన్ ఏంటి?
 
దర్శకుడు చందు..ఈ సినిమాలో అది ఉంటుందా అంటే అది కథలో ఫ్లో లో ఉంటుంది కాబట్టి అది థియేటర్ లో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరు. కృష్ణ తత్త్వం అనేది చెప్పాలని రాయలేదు.ఈ కథతో చెప్తే ఇంట్రెస్ట్ గా బాగుంటుంది అని చెప్పడం జరిగింది. మీరు ఈ మూవీ చూస్తే మీకే తెలుస్తుంది. అలాగే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ చూడకపోయినా మీకు సెకెండ్ పార్ట్ లో అర్థమై పోతుంది లగే రహో మున్నాబాయి కంటే ముందు మున్నబాయ్ MBBS సినిమాలా  క్యారెక్టర్స్  క్యారీ అవుతుంది కానీ కథ మాత్రం వేరు.
 
విశ్వప్రసాద్ ను చూజ్ చేసుకోవడానికి కారణ మేంటి?
హీరో నిఖిల్ : విశ్వప్రసాద్ గానీ, అభిషేక్ గారు గానీ  డబ్బులు కోసం కార్తికేయ 2 తియ్యలేదు. కంటెంట్ ను నమ్మి  సినిమాను లవ్ చేసి నిర్మాత గా వచ్చారు.
 
ఐదు లాంగ్వేజ్ లలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది మీరు పాన్ ఇండియా స్టార్ అవ్వాలను కున్నారా లేక ఇది యూనివర్సల్ సబ్జెక్టు కాబట్టి పాన్ ఇండియా రిలీజ్ చేస్తారు అనుకుంటున్నారా?
 
హీరో నిఖిల్ : ఈ సినిమాను డిఫరెంట్ డిఫరెంట్ భాషల్లో మల్టీ లాంగ్వేజస్ లలో ఈ సినిమాను ఎక్కువ మంది చూడాలని ఈ సినిమా తీశాము.ఈ సినిమాకు నేను హీరో ను కాదు. మేము ఎంచుకున్న పాయింట్ కృష్ణ తత్త్వం.మా సినిమా హీరో కృష్ణుడే అని మేము చాలా నమ్మాము. ఇప్పుడు కూడా కృష్ణుడే మమ్మల్ని నడిపిస్తున్నాడు అనుకుంటున్నాము. ఈ కథ యూనివర్సల్.స్విజ్జర్లాండ్ నుండి ఇస్కాన్ వారున్నారు. అంటార్కీటికా లో కృష్ణున్ని పూజిస్తారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గొప్ప దేవుణ్ణి సినిమాగా తీసినప్పుడు అన్ని భాషల్లో ఉండాలని తీశాము.ఇస్కాన్ వారు మమ్మల్ని మధురకు పిలిచారు. మేమంతా వెళ్ళాము. అది మాకు గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంతే తప్ప  నేను పాన్ ఇండియా స్టార్ కావాలని మాత్రం కాదు.
 
మీరు చేయబోయే  సినిమాలు 4,5 లాంగ్వేజ్ లలో ఉంటాయా ?
హీరో నిఖిల్ .ఒక వేళ నా సినిమాలకు డిమాండ్ ఉంటే అవ్వచ్చు. ప్రతి సినిమా అవుతుంది అని చెప్పలేను. కొన్ని సార్లు రీజనల్ ఫిల్మ్స్ చేస్తాము. ఇప్పుడు లేను  స్పై ఫిలిం చేస్తున్నాను..రా ఏజెంట్ సినిమాను ఇండియా మొత్తం చూస్తారు అనుకున్నప్పుడు అవి వర్క్ అవుట్ అవుతాయి
 
ఈ సినిమకు సీక్వెల్ ఉంటుందా..?
దర్శకుడు చందు .. ఇండియన జోన్స్ లా భారతీయ కల్చర్ తో కొత్త కొత్త  అడవెంచర్స్ కాన్సెప్ట్ తో స్టోరీస్ వస్తుంటాయి.
 
ఈ సినిమాను ప్రస్తుతం ఎన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు?
నిర్మాత అభిషేక్. అగర్వాల్.. ప్రస్తుతం ఈ సినిమాను తెలుగు, హిందీ, మలయాళం లో రిలీజ్ చేస్తున్నాము.
 
భాగవతం ను కాన్సెప్ట్ తీసుకువడానికి కారణమేంటి?
దర్శకుడు చందు .. కృష్ణుడు కథ యూనివర్షల్. అయన గురించి చాలా మందికి చాలా తెలియవు. ఇలాంటి మోడరన్ టైమ్ లో అయన గొప్ప తనం గురించి ఇప్పటి తరం యూత్ కు  ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నాము