శుక్రవారం, 1 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 19 జులై 2022 (16:35 IST)

కార్తికేయ 2 యూనిట్‌కు బృందావన్ కు ప్రత్యేక ఆహ్వానం

Karthikeya 2 team with ISKCON Vice President Radha Ramdas
Karthikeya 2 team with ISKCON Vice President Radha Ramdas
హీరో నిఖిల్, విలక్షణ దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్‌లో వస్తున్న కార్తికేయ 2 సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రానికి తాజాగా అరుదైన ఆహ్వానం లభించింది. కార్తికేయ 2 చిత్రం శ్రీ కృష్ణుడి తత్వం, ఆయన బోధించిన ఫిలాసఫీ ఆధారంగా వస్తుందని.. టీజర్, మోషన్ పోస్టర్‌ను చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధా రాందాస్ ప్రశంసల వర్షం కురిపించారు. 
 
తాజాగా కార్తికేయ 2 చిత్రయూనిట్‌కు ఇస్కాన్ అత్యున్నత సంస్థానం బృందావన్‌కు రావాలంటూ వైస్ ప్రెసిడెంట్ రాధా రాందాస్ నుంచి ఆహ్వానం లభించింది. ఇస్కాన్ దేవాలయాలు కేవలం ఇండియాలో మాత్రమే కాదు.. దేశదేశాల్లో ఖండఖండాంతరాలుగా వ్యాపించి ఉన్నాయి. ఆస్ట్రియా లాంటి దేశాల నుంచి మొదలుపెట్టి ఎన్నో వందల దేశాల్లో ఇస్కాన్ టెంపుల్స్ కొలువై ఉన్నాయి. అంతటి ప్రగ్యాతి గాంచిన ట్రస్ట్ నుంచి కార్తికేయ 2 టీమ్‌కు ఆహ్వానం లభించడం నిజంగా గర్వించదగ్గ విషయం. 
 
ఇప్పటి వరకు ఇతిహాసాల నేపథ్యంలో, మైథలాజికల్ స్టోరీస్‌ నేపథ్యంలో ఎన్నో వందల సినిమాలు వచ్చాయి. భారతం, భాగవతం, రామాయణాలపై సినిమాలతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సీరియల్స్ రూపొందాయి. అయితే భారతీయ సినీ చరిత్రలో ఎవరికీ దక్కని గౌరవం కార్తికేయ 2 టీంను వరించింది. బృందావన్‌కు ఆహ్వానం అనేది చిన్న విషయం కాదు. శ్రీ కృష్ణుడి తత్వం, ఫిలాసఫీ, ఆయన ఆరా భరతఖండంపై ఎలా ఉంది.. ాయన బోధించిన సారాంశం ఏంటి అనేది కోర్ పాయింట్‌గా కార్తికేయ 2 సినిమా ఉండబోతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.