గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 ఆగస్టు 2022 (23:09 IST)

భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటానో లేదో.. దుల్కర్ మాత్రం?: నిత్యామీనన్

nithya menon
విభిన్న పాత్రలతో ఆకట్టుకునే హీరోయిన్‌ నిత్యామీనన్ పెళ్లి వార్తలపై స్పందించింది. తన కాలికి గాయం తీసుకోవడంతో విశ్రాంతి తీసుకుంటున్నానని.. పెళ్లి చేసుకోవడం కోసం కాదని హీరోయిన్ నిత్యామీనన్ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి తనకు పెళ్లి ఆలోచన లేదని నిత్యా మీనన్ తెలిపింది. 
 
ఇదే సమయంలో.. దుల్కర్ సల్మాన్ తనకు ఒక మంచి స్నేహితుడని, పెళ్లి చేసుకొని ఫ్యామిలీతో హ్యాపీగా ఉండమని సూచిస్తుంటాడని తెలిపింది. తాము కలిసినప్పుడల్లా పెళ్లి ప్రస్తావన వస్తూనే ఉంటుందని పేర్కొంది. 
 
అయితే.. తనకు మాత్రం ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని వెల్లడించింది. భవిష్యత్తుల్లో కూడా చేసుకుంటానో లేదోనంటూ కుండబద్దలు కొట్టింది.