బుధవారం, 21 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2022 (21:40 IST)

ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడమే మేలట.. ఉదయ్ కిరణ్ పరిస్థితే.. (video)

Prabhas
ప్రభాస్ బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. కెరీర్ పరంగా ప్రస్తుతం బాగానే ఉన్నప్పటికీ ఈయన వివాహ విషయంలో మాత్రం అభిమానులు చాలా నిరుత్సాహంతో ఉన్నారని చెప్పవచ్చు. ప్రభాస్ అభిమానులు కూడా తన పెళ్లి గురించి శుభవార్త ఎప్పుడు చెబుతారని చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 
 
ఇప్పటికే ప్రభాస్‌కు ఎన్నోసార్లు తన పెళ్లి గురించి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి కానీ ప్రభాస్ కానీ తన కుటుంబం కాని ఎప్పుడూ ఈ విషయంపై స్పందించలేదు. 
 
అయితే ఆయనకి పెళ్లి కాకపోవడమే బెటర్ అని మరి కొంతమంది అంటున్నారు. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ప్రభాస్ పెళ్లి చేసుకుంటే ఆయన పరిస్థితి ఉదయ్ కిరణ్ పరిస్థితిలా అవుతుందని ఒక వార్త రెట్టింపు స్థాయిలో వైరల్‌‌గా మారుతుంది. 
 
ఉదయ్ కిరణ్ కూడా మంచి హోదా ఉన్న సమయంలోనే వివాహం చేసుకొని ఆ తర్వాత కొన్ని కారణాల చేత ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ప్రభాస్‌కు కూడా ఇదే పరిస్థితి వస్తుందని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గతంలో చెప్పడంతో ప్రస్తుతం ఈ వార్త చాలా వైరల్‌గా మారుతోంది.
 
అయితే ఈ వేణు స్వామి చెప్పిన వార్తలు గతంలో పలువురు సెలబ్రిటీల విషయంలో చెప్పినవన్నీ నిజం కావడంతో.. ఈ వార్తపై ఆయన ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.