శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 ఆగస్టు 2022 (10:37 IST)

అలాంటి వాళ్లు తిరుమలకు రావొద్దు : తితిదే అధికారులు

tirumala
రద్దీ రోజుల్లో వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు తిరుమల కొండపైకి రావొద్దని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విజ్ఞప్త చేశారు. ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వరుసగా సెలవులు వస్తున్నాయి. ఈ కారణంగా భక్తులు భారీగా తరలివస్తారని, దీంతో తిరుమలో రద్దీ పెరిగే అవకాశం ఉందని తితిదే అధికారులు అంచనా వేస్తున్నారు. 
 
ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని వృద్ధులు, చిన్నపిల్లలు, తల్లిదండ్రులు, దివ్యాంగులు తిరుమల పర్యటన వాయిదా వేసుకోవాలని ఆయన కోరారు. తిరుమలకు వచ్చే సాధారణ భక్తులు ప్రణాళికాబద్ధంగా ముందుగానే దర్శనం, వసతి బుక్ చేసుకుని తిరుమలకు రావాలని తితిదే అధికారులు కోరారు.