సంబంధిత వార్తలు
- అమర్నాథ్ యాత్రలో విషాదం - 84 మంది ఆంధ్రా యాత్రికులు సేఫ్
- తితిదే చరిత్రలో శ్రీవారి ఆదాయంలో సరికొత్త రికార్డు
- ప్రధాని మోడీ హెలికాప్టర్‌కి ఎదురుగా నల్ల బెలూన్లు, తప్పించుకున్న ప్రధాని
- సెప్టెంబరు 27 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు : ఈవో ధర్మారెడ్డి
- శ్రీవారి భక్తులకు శుభవార్త - ఆన్లైన్లో అంగప్రదక్షిణ టోకెన్ల విక్రయం
శ్రీవారి ఆదాయం రూ.5 కోట్ల ఆదాయం.. తప్పిన ముప్పు
కలియుగ వైకుంఠదైవం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మొత్తం 31 కంపార్టుమెంట్లలో శ్రీవారి భక్తులు నిండిపోయివున్నాయి. వీరికి పది గంటలపాటు దర్శన సమయం పడుతుందని తితిదే వర్గాలు వెల్లడించాయి.
మంగళవారం తిరుమల శ్రీవారిని 74212 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అలాగే, హుండీ ఆదాయం రూ.5.05 కోట్ల మేరకు వచ్చింది. మరోవైపు, తిరుపతి శ్రీ కపిలేశ్వర ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు బుధవారంతో ముగిశాయి.
తిరుపతి జిల్లా చంద్రగిరి వద్ద శ్రీవారి భక్తులకు పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై ఓ కారుకు ఆకస్మికంగా మంటలు చెలరేగి అది పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురు శ్రీవారి భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. తిరుమల నుంచి వేలూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.
