సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 జూన్ 2022 (09:40 IST)

శ్రీవారి భక్తులకు శుభవార్త - ఆన్‌లైన్‌లో అంగప్రదక్షిణ టోకెన్ల విక్రయం

తిరుమల శ్రీవారి భక్తులకు తితిదే పాలక మండలి శుభవార్త చెప్పింది. బుధవారం నుంచి శ్రీవారి అంగప్రదక్షిణ టోకెన్లను అందుబాటులో ఉంచనుంది. ఈ నెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రోజుకు 750 టిక్కెట్ల చొప్పున ఆన్‌లైన్‌‌లో విక్రయిస్తామని తితిదే అధికారులు వెల్లడించారు. ఈ టోకెన్లను కావాలనుకునేవారు https//tirupathibalaji.ap.gov.in అనే వెబ్‌సైట్‌ నుంచి బుక్‌ చేసు‌కో‌వ‌చ్చని తెలిపారు. 
 
మరోవైపు, పౌర్ణమిని పురస్కరించుకుని మంగళవారం శ్రీవారికి గరుడసేవ చేయాల్సివుంది. కానీ, ఈ సేవను రద్దు చేశారు. ఈ సేవను ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే, ప్రస్తుతం స్వామివారి వార్షిక జ్యేష్ఠాభిషేకం ముగింపు వేడుకలు జరుగుతున్నందున ఈ గరుడ సేవను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.