ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ప్రారంభం: అమెరికా మిత్రపక్ష దేశాలపై ఇరాన్ బాంబులు
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
బహ్రెయిన్ దేశంలోని అమెరికా నావికాదళ కేంద్రంపై, యూఏఇలోని అల్-డఫ్రా సైనిక స్థావరం, కువైట్ దేశంలోని అలీ అల్ సలేమ్ ఎయిర్ బేస్ పైన, జోర్డాన్, ఖతార్ దేశాలలో వున్న అమెరికా స్థావరాలపై ఇరాన్ వైమానిక దాడులు చేస్తుంది. అబుదాబిలో బాంబు పేలుళ్ల శబ్దంతో ప్రజలంతా భీతావహులై ఇళ్ల నుంచి బైటకు రావడంలేదు. ఇజ్రాయెల్ దేశంతో పాటు మరో 6 దేశాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. దీనితో ఈ యుద్ధం ఎలాంటి మలుపు తీసుకుంటుందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇజ్రాయెల్ ఇరాన్‌పై ముందస్తు దాడిని ప్రారంభించిందని ఆ దేశ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ చెప్పారు. ఆయన మాట్లాడుతూ... దేశం అంతటా తక్షణ అత్యవసర పరిస్థితిని ప్రకటించాము. ఇజ్రాయెల్ పైన వున్న ముప్పును తొలగించడానికి ఇజ్రాయెల్ దేశం ఇరాన్‌పై ముందస్తు దాడిని ప్రారంభించింది. భద్రతా పరిస్థితి కారణంగా పౌరులు తమ దగ్గర ఉన్న సరైన రక్షిత షెల్టర్ ఏమిటో తెలుసుకుని, అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని ఆయన చెప్పారు.
