మంగళవారం, 20 జనవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By ఠాగూర్

తిరుమలలో పెరిగిన రద్దీ.. సర్వదర్శనానికి 30 గంటలు.. లడ్డూల కొరత?

ttd devotees in q line
తిరుమలలో ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. దీంతో సర్వదర్శనానికి ఏకంగా 30 గంటల సమయం పడుతోంది. అదేసమయంలో భక్తుల తాకిడి పెరగడంతో శ్రీవారి లడ్డూలకు కూడా కొరత ఏర్పడినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఒక్కసారిగా పోటెత్తారు. దీంతో తిరుమల కొండపై ఇసుకేస్తే రానంతగా భక్తులు చేరిపోయారు. భక్తజనం విపరీతంగా రావడంతో కొండపై భక్తులతో కిటకిటనెలకొంది. ఫలితంగా శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతుంది. 
 
వైకుంఠంతో పాటు నారాయణగిరి కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయివున్నాయి. పైగా, 3 కిలోమీటర్ల మేరకు భక్తులు క్యూలో ఉన్నారు. భక్తుల తాడితో క్యూలైన్లు శ్రీవారి సేవా సదన్ వరకు నండిపోయివున్నారు. భక్తులు ఒక్కసారిగా పెరగడంతో శ్రీవారి లడ్డూల కొరత కూడా ఏర్పడింది.