శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 జూన్ 2022 (17:43 IST)

కొత్త వివాదంలో కొత్త పెళ్లి కూతురు.. చెప్పులేసుకుని మాడవీధుల్లో నయన

Nayanatara
Nayanatara
సినీ నటి నయనతార, తమిళ సినీ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌లు వివాహానంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం నూతన వధూవరులు శ్రీవారిని సేవించుకున్నారు. స్వామి వారిని దర్శించుకుని బయటు వచ్చారు. వీరిని చూసేందుకు అభిమానులు పోటెత్తారు. 
 
అయితే ఈ సందర్భంగా నయనతార ఒక వివాదంలో చిక్కుకున్నారు. దర్శనానంతరం బయటకు వచ్చిన ఆమె మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని నడిచారు. ఆమె భర్తతో పాటు ఇతరులందరూ చెప్పుల్లేకుండానే నడిచారు. నయనతార చెప్పులు ధరించడం వివాదాస్పదమయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
కాగా నయనతార, విఘ్నేశ్ శివన్‌ల వివాహం గురువారం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. మహాబలిపురంలోని ఓ ఖరీదైన రిసార్టులో వీరి వివాహం వైభవంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు వీరి వివాహానికి విచ్చేశారు.