గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 జూన్ 2022 (10:01 IST)

నయనతార, విఘ్నేష్ శివన్ వెడ్డింగ్ లైవ్ అప్ డేట్స్.. జూన్ 10న గ్రాండ్ రిసెప్షన్

nayanatara_vignesh
దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్‌ల వివాహం జూన్ 9న  జరుగుతోంది. కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు మాత్రమే హాజరయ్యే వారి వివాహం ప్రైవేట్ వ్యవహారంగా ఉంటుందని చిత్రనిర్మాత ఇటీవల వెల్లడించారు. 
 
మహాబలిపురంలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో ఈ సెలబ్రిటీ పవర్ కపుల్ దక్షిణ భారత  సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకోనున్నారు. దీని తరువాత జూన్ 10న గ్రాండ్ రిసెప్షన్ ఉంటుంది. విఘ్నేష్ శివన్ పెళ్లిని ప్రకటించినప్పటి నుండి, నయనతార అభిమానులు తమ అభిమాన స్టార్ కపుల్‌కు అభినందన సందేశాలతో సోషల్ మీడియాను ముంచెత్తుతున్నారు. 
 
ఒక వివాహ ఆహ్వానం కూడా ఇంటర్నెట్లో ప్రత్యక్షమైంది. అది వైరల్ అవుతోంది. ఈ జంట తమిళ పరిశ్రమలోని కొంతమంది పెద్దలను పెళ్లికి ఆహ్వానించారు. ఈ జాబితాలో సీఎం స్టాలిన్, రజినీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, సూర్య, అజిత్, కార్తీ, విజయ్ సేతుపతి, సమంత రూత్ ప్రభు గెస్ట్ లిస్టులో ఉన్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కూడా ఈ వివాహానికి హాజరయ్యే అవకాశం ఉంది. అట్లీ 'జవాన్'లో షారుఖ్, నయనతార కలిసి నటిస్తున్నారు.