శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 జూన్ 2022 (09:11 IST)

తిరుమల నుంచి మహాబలిపురానికి అందుకే మార్చాం.. విఘ్నేశ్

nayanatara_vignesh
అగ్ర హీరోయిన్ నయనతార, తమిళ సినీ దర్శకుడు విఘ్నేశ్ శివన్ పెళ్లి త్వరలో జరుగనుంది. ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి, వీరు వివాహ ఆహ్వాన పత్రికను నయన్ అందించారు.  తాజాగా తమ వివాహంపై విఘ్నేశ్ శివన్ అధికారికంగా స్పందించాడు. 
 
తన ప్రేయసి నయనతాను పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పాడు. జూన్ 9న మహాబలిపురంలో తమ పెళ్లి జరగబోతోందని తెలిపాడు. తొలుత తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని.. అయితే ప్రయాణ పరంగా కొన్ని సమస్యలు ఉండొచ్చనిపించడంతో వివాహ వేదికను మహాబలిపురానికి మార్చామని తెలిపాడు. 
 
జూన్ 9న పెళ్లి జరుగుతుందని... పెళ్లి ఫొటోలను మధ్యాహ్నానికల్లా సోషల్ మీడియాలో షేర్ చేస్తామని విఘ్నశ్ తెలిపాడు. జూన్ 11న ఇద్దరం అందరినీ ప్రత్యేకంగా కలుస్తామని చెప్పాడు. తమపై అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకున్నాడు.