1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 జూన్ 2022 (19:43 IST)

పెళ్లి విందు.. రెండోసారి భోజనం చేసిన మహిళపై కర్రలతో దాడి

Food
పెళ్లి విందులో ఓ మహిళ రెండో సారి భోజనం చేసిందని ఆమెపై దాడికి పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుబీర్ మండలం సేవాదాస్ నగర్ తండాలో ఓ వివాహం జరిగింది.  
 
గత రెండు రోజుల క్రితం తండాలో ఓ విందు వేడుక జరిగింది. అయితే ఇదే తండాకు చెందిన రోజా భాయి అనే మహిళా భోజనం చేసేందుకు వెళ్ళింది. రెండోసారి సైతం భోజనం చేస్తుండగా.. గమనించిన కొందరు ఆమెను అడ్డుకొని దాడి చేశారు.
 
దీంతో ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగగా.. సదరు మహిళ తలపై కర్రలతో దాడి చేశారు. ఘర్షణను ఆపడానికి వెళ్లిన వారికి సైతం గాయాలయ్యాయి. 
 
తీవ్ర గాయాలపాలైన మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు కుబీర్ పోలీసులు ఐదుగురు పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.