సంబంధిత వార్తలు
- కేకే మృతి.. ప్రముఖుల సంతాపం.. అక్షయ్, సెహ్వాగ్, తమన్నా ఆవేదన
- ఫేస్బుక్ ప్రేమ.. సరిహద్దు దాటిన యువతి.. కానీ కటకటాలకు..?
- ప్రియురాలి కోసం ఖర్చు చేసిన లెక్కలు రాసిపెట్టి ప్రియుడు ఆత్మహత్య
- ఫ్లోరిడాలో పారాసెయిలింగ్ ప్రమాదంలో బాపట్ల మహిళ మృతి
- పెళ్లై 15 రోజులే.. కాపురానికి వెళ్లనన్న కూతురు.. ఇద్దర్నీ చంపేసిన కిరాతకుడు
ప్రేమించలేదని హత్య... 14 కత్తిపోట్లు.. పొట్టంతా ఛిద్రమైపోయింది..
ఓ యువతి ప్రేమించలేదని ఓ ఉన్మాది దారుణంగా హత్య చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, తిరుచ్చిలోని అతికుళంకు చెందిన కేశవన్ అనే 22 ఏళ్ళ యువకుడు, ఇంటర్ చదివే యువతిని ప్రేమించాడు.
గత రెండెళ్లుగా ప్రేమించమని వెంటపడుతున్నాడు. కానీ ఆ యువతి అతడి ప్రేమను నిరాకరించింది. అతని వేధింపులు ఎక్కువ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, కేశవన్ ను అరెస్టు చేశారు. అయితే, నిందితుడు ఇటీవల జైలు నుంచి విడుదలయ్యాడు. మరల యువతి కోసం వెతికాడు.
యువతి కాలేజ్ నుంచి బయటకు వస్తుండగా తన ప్రేమను రిజెక్ట్ చేసినందుకు ఆమెతో వాగ్వాదానికి వెళ్లాడు. అందరు చూస్తుండగానే నడిరోడ్డు మీద కత్తితో విచక్షణ రహితంగా దాడిచేశాడు.
యువతి రక్తపు మడుగులోన రోడ్డుమీద కుప్పకూలిపడిపోయింది. ఆ తర్వాత స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాలికను చూసిన వైద్యులు దాదాపు.. 14 కత్తిపోట్లకు గురైందని తెలిపారు. ఆమె పొట్టంతా కత్తిగాట్లతో ఛిద్రమైపోయింది. ప్రస్తుతం బాలిక చనిపోయింది. ఆ తర్వాత నిందితుడు కేశవన్ అక్కడే రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది.
