1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 జూన్ 2022 (14:02 IST)

కేకే మృతి.. ప్రముఖుల సంతాపం.. అక్షయ్, సెహ్వాగ్, తమన్నా ఆవేదన

KK
KK
కోల్‌కతాలోని గురుదాస్ కళాశాల ఫెస్ట్‌లో ప్రదర్శన చేస్తున్నప్పుడు గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ అకా కెకె ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం ప్రారంభించింది. ప్రేక్షకులను అలరిస్తూనే, గాయకుడు తన ఆరోగ్యం గురించి తన సహోద్యోగులకు పదేపదే చెబుతున్నాడు. మరింత ఇబ్బంది ఉన్నప్పుడు, స్పాట్‌లైట్‌ను ఆపివేయమని మేకర్స్‌ని కోరాడు. 
 
రాత్రి 8:30 గంటల ప్రాంతంలో, ప్రత్యక్ష సంగీత కచేరీ ముగించుకుని KK తిరిగి హోటల్‌కి చేరుకున్నారు. అయితే ఇక్కడ కూడా విశ్రాంతి తీసుకోకపోవడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత సుమారు 10:30 గంటలకు అతన్ని కలకత్తా మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎంఆర్ఐ)కి తీసుకెళ్లారు, అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారు. కేకే మరణం పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 
 
కేకే మరణవార్త ఆయన అభిమానులను, ప్రముఖులు, సన్నిహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. కేకే మృతిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పాటలు అన్ని రకాల భావోద్వేగాలను ప్రతిబింబిస్తాయని, అన్ని వయసుల వారిని అలరిస్తాయని అన్నారు. ఆయన పాటల ద్వారా ఎప్పటికీ కేకేను గుర్తుంచుకుంటామని అన్నారు. కేకే కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, సినీ నటి తమన్నా, సంగీత దర్శకుడు తమన్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.  
 
కేకే మృతి వార్త తనను షాక్‌కు గురిచేసిందని బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ అన్నారు. కేకే మృతి తీరని లోటని పేర్కొన్నారు. కేకే పాటలు, ఆయన గాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటాయని గాయకుడు పాపాన్ అంగారాగ్ ట్వీట్ చేశారు. దేవుడు ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. 
 
కేకే మరణవార్త వినాల్సి రావడం విషాదకరమని, జీవితం ఎంత దుర్భలమైందో ఆయన మరణం మరోమారు గుర్తు చేసిందని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్టు పేర్కొన్నాడు.