శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 28 మే 2022 (11:04 IST)

ఎన్‌టిఆర్ జ‌యంతి సంద‌ర్భంగా మాస్ ప‌వ‌ర్ ఎన్‌బికె 107 పోస్ట‌ర్

NBk 107 poster
NBk 107 poster
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక శ్రీ నందమూరి తారక రామారావు గారి శతజయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ.. నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న తాజా చిత్రం మాస్ ప‌వ‌ర్ ఎన్‌బికె 107 పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ శ‌నివారంనాడు విడుద‌ల చేసింది.
 
ఫుల్ వైట్ అండ్ వైట్ లో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ లో కత్తి పట్టుకొని ఉన్న బాలయ్య మంచి అగ్రెసివ్ గా కనిపిస్తున్నారు. అఖండ త‌ర్వాత బాల‌కృష్ణ న‌టిస్తున్న చిత్ర‌మిది.  గోపీచంద్ మలినేని ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే ఈ చిత్రం స‌గ‌భాగం పూర్త‌యింది. పూర్తి యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో నాయిక‌గా శృతి హాసన్ న‌టిస్తోంది. థ‌మ‌న్ బాణీలు స‌మ‌కూరుస్తున్నారు.