గురువారం, 7 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 జూన్ 2022 (07:54 IST)

ఫ్లోరిడాలో పారాసెయిలింగ్ ప్రమాదంలో బాపట్ల మహిళ మృతి

deadbody
అమెరికాలో జరిగిన  పారాసెయిలింగ్ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్లకు చెందిన సుప్రజ (34) అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈమెకు భర్త శ్రీనివాసరావు, అక్షిత్ చౌదరి, శ్రీ అధిరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, కుమారుడు అక్షిత్‌తో కలిసి సుప్రజ బోటు పారాసెయిలింగ్ చేస్తుండగా, ఒక్కసారిగా వాతావరణం ప్రతికూలంగా మారిపోయింది. 
 
బలమైన గాలులు వీయడంతో ఆ పారాచ్యూట్‌ను బోటుకు అనుసంధానించిన తాళ్లు తెగిపోయాయి. దీంతో ఆ పారాచ్యూట్ ఓ వంతెనను బలంగా తాకడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన సుప్రజ ప్రాణాలు కోల్పోగా, కుమారుడు తేలికపాటి గాయాలతో బయటపడ్డాడు. 
 
ఇదిలావుంటే, బాపట్ల జిల్లా మార్టూరు మండలం చింతపల్లిపాడుకు చెందిన శ్రీనివాసరావు దంపతులు గత 2012లో అమెరికా వెళ్ళారు. శ్రీనివాస రావు షికాగోలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. అక్కడ నుంచి తమ మకాంను ఫ్లోరిడాకు మార్చారు. అక్కడ భార్యాపిల్లలతో ఉంటున్న సుప్రజ ఇలా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది.