శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 18 మే 2022 (09:42 IST)

ఎవడితో కులుకుతున్నావ్ అంటూ భర్త వేధింపులు, మర్మాంగాన్ని కోసేసింది

knife
ఎవడితో కులుకుతున్నావ్ అంటూ ఆ భర్త నిత్యం భార్యను వేధిస్తున్నాడు. అతడి వేధింపులతో విసిగిపోయిన భార్య పదునైన కత్తితో అతడి మర్మాంగాన్ని కోసేసింది. తీవ్ర రక్తస్రావమై అతడు మృతి చెందాడు.

 
పూర్తి వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రలోని కొల్హాపూరు వ్యవసాయ క్షేత్రంలో వందన,ప్రకాష్ దంపతులు వుంటున్నారు. ఐతే భార్యకు ఎవరితోనో వివాహేతర సంబంధం వుందని ప్రకాష్ కి అనుమానం. దీనితో తాగుడుకి బానిసయ్యాడు. నిత్యం ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.

 
మంగళవారం రాత్రి ఇంటికి వచ్చి ఎవడితో కులుకుతున్నావో చెప్పు అంటూ తీవ్రంగా వేధిస్తూ కొట్టడం ప్రారంభించాడు. దీనితో తీవ్ర ఆగ్రహానికి గురైన వందనా.... పదునైన కత్తి తీసుకుని భర్త మర్మాంగాన్ని కోసేసింది. దీనితో అతడు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.