మ్యూజిక్ డైరెక్టర్ డి ఇమ్మాన్ రెండో పెళ్లి.. ఫోటోలు వైరల్
తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ డి ఇమ్మాన్ రెండో పెళ్లి చేసుకున్నారు. కోలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ ఉబాల్డ్ కుమార్తె అమేలీతో అతని రెండో వివాహం జరిగింది. వీరి వివాహానికి కుటుంబ సభ్యులు, బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
ప్రస్తుతం ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఇమ్మాన్ 2008 ఏప్రిల్‌లో కంప్యూటర్ ఇంజినీర్‌గా పనిచేసే మోనికా రిచర్డ్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు వున్నారు. అయితే అనూహ్యంగా 13 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతూ 2021, డిసెంబర్ 29న విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు.
కాగా విడాకుల తర్వాత జీవితంలో మరో అడుగు ముందుకు వేయడానికీ సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల ఓ పోస్ట్ పెట్టాడు ఇమ్మాన్. ప్రస్తుతం ఆ మాటలను నిజం చేస్తూ రెండోసారి పెళ్లి పీటలెక్కాడు. 2002లో విజయ్, ప్రియాంక చోప్రా జంటగా నటించిన "తమిళన్" చిత్రంతో సంగీత దర్శకుడిగా మారాడు ఇమ్మాన్.
విజయ్‌తో పాటు విక్రమ్, అజిత్, ఆర్య, ధనుష్, విజయ్ సేతుపతి, జయం రవి తదితర స్టార్ హీరోల సినిమాలకు స్వరాలు సమకూర్చారు. అజిత్ హీరోగా నటించిన విశ్వాసం చిత్రానికి గాను జాతీయ అవార్డును అందుకున్నాడు.