గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 మే 2022 (12:48 IST)

రూమర్స్ వల్లే పెళ్లి చేసుకోలేక పోయా : కంగనా రనౌత్

Kangana Ranaut
చిత్రపరిశ్రమలో తన గురించి వచ్చిన రూమర్స్ వల్లే తాను పెళ్ళి చేసుకోలేక పోయినట్టు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వెల్లడించారు. ఈమె నటించిన "గూఢచార", యాక్షన్ ఆధారిత "ధాకడ్" చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన గురించి వచ్చిన రూమర్ల వల్ల తనకు సరైన జోడీని ఎంచుకోలేక పోయానని, అందువల్ల తాను పెళ్ళి చేసుకోలకపోయినట్టు చెప్పారు. అయితే, నిజజీవితంలో టామ్ బాయ్‌గా ఉంటారా అనే ప్రశ్నకు ఆమె నవ్వుతూ సమాధానమిచ్చారు. 
 
"నేను అలా ఉండను. నిజ జీవితంలో నేను ఎవరిని కొట్టాను. చూపించండి. మీ లాంటి వ్యక్తులు ఈతరహా పుకార్లను వ్యాప్తి చేయడం వల్ల వల్లే నేను పెళ్ళి చేసుకోలేక పోయాను" అని చెప్పారు. ముఖ్యంగా, నేను అబ్బాయిలను కొడతానన్న పుకార్ల కారణంగానే తాను పెళ్లికి దూరంగా ఉన్నట్టు తెలిపారు.