మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 మే 2022 (21:58 IST)

"కేజీఎఫ్-2" సినిమా చూస్తూ వ్యక్తి మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. కనకవర్షం కురిపిస్తున్న "కేజీఎఫ్-2" చిత్రాన్ని చూస్తున్న ఓ ప్రేక్షకుడు థియేటర్‌లోనే తుదిశ్వాస విడిచారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఏలూరు నగరంలోని ఓ థియేటర్‌లో ప్రదర్శితమవుతున్న 'కేజీఎఫ్ 2' చిత్రాన్ని చూస్తూ ఓ ప్రేక్షకుడు థియేటర్‌లోనే కోల్పోయాడు. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు థియేటర్‌కు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి ఈ కేసుపై దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రేక్షకుడు ఏ కారణంతో చనిపోయాడన్న అంశంపై విచారణ జరుపుతున్నారు. కాగా గత నెల 14వ తేదీన విడుదలైన ఈ కేజీఎఫ్ చిత్రం దేశంలో కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్న విషయం తెల్సిందే.