శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 9 మే 2022 (19:59 IST)

సింగర్స్‌గా విష్ణు మంచు కుమార్తెలు అరియానా, వివియానా

Ariana-Vviana
డైనమిక్ స్టార్ విష్ణు మంచు హీరోగా నటిస్తున్న తాజా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో 'గాలి నాగేశ్వరరావు' అనే మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు విష్ణు. ఈ క్యారెక్టర్ రివీల్ చేసినప్పట్నుంచి సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ వంటి తారలు యాడ్ అవ్వడం సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా ఈ సినిమాలోని ఓ పాటకు కొరియోగ్రఫీ చేస్తుండటం ఈ సినిమాకి మరో హైలైట్. తాజాగా మరో స్పెషల్ అట్రాక్షన్ ఈ సినిమాకి యాడ్ అయ్యింది. 
 
అదేంటంటే... డా.మంచు మోహన్ బాబు గారి మనవరాళ్లు, విష్ణు మంచు కుమార్తెలు అరియానా, వివియానా ఈ సినిమా ద్వారా సింగర్స్‌గా పరిచయం అవుతున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్న ఈ సినిమాలోని ఓ పాటను అరియానా, వివియానా పాడటం విశేషం. భాస్కరభట్ల ఈ పాటకు సాహిత్యం అందించారు. 
 
సినిమాకి కీలకంగా నిలిచే ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఈ సినిమా విషయంలో విష్ణు మంచు తీసుకుంటున్న కేర్, సినిమాపై భారీ అంచనాలు నెలకొనేలా చేస్తున్నాయి. డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో విష్ణు మంచు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి కథ, స్ర్కీన్‌ప్లేతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చోటా. కె. నాయుడు కెమెరామ్యాన్‌గా, భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు. జి.నాగేశ్వరరెడ్డి మూల కథ అందించారు.