శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 మే 2022 (22:37 IST)

అశోకవనంలో అర్జున కళ్యాణం.. ఓటీటీపై విశ్వక్ సేన్ క్లారిటీ..(video)

Ashoka Vanamlo Arjuna Kalyanam
Ashoka Vanamlo Arjuna Kalyanam
అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ చాలానే కష్టపడ్డాడు. అతని కృషికి అశోకవనంలో అర్జున కళ్యాణం హిట్ మంచి ఫలితం ఇచ్చిందనే చెప్పాలి. 
 
అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా ఓటిటీ రిలీజ్ డేట్ ఇదేనంటూ సోషల్ మీడియా లో వార్తలు గుప్పుమన్నాయి. మరో నాలుగు వారాల్లో ఈ సినిమా ఆహా లో ప్రసారం కానున్నట్లు వీడియోలతో సహా నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో కొంతమంది ప్రేక్షకులు ఇంకెందుకు థియేటర్‌కు వెళ్లడం ఓటిటీలో చూడొచ్చు అని వెనుకడుగు వేస్తున్నారు. తాజాగా ఈ రూమర్స్‌పై విశ్వక్ స్పందించాడు.
 
దయచేసి అలాంటి రూమర్స్‌ను స్ప్రెడ్ చేయవద్దని నెటిజన్లను కోరాడు విశ్వక్. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ఓటీటీలో వస్తుందనే వార్తల్లో నిజం లేదన్నాడు.
 
 



"నిజం చెప్పాలంటే నాకు కూడా రిలీజ్ డేట్ పై క్లారిటీ లేదు. అస్సలు ఇప్పటివరకు ఈ సినిమా ఓటిటీ హక్కులు వారివద్దకు వెళ్ళలేదు. స్ట్రీమింగ్ డేట్ ప్రకటించగానే అధికారికంగా మేమే వెల్లడిస్తాం. ఇలాంటి రూమర్స్‌ వల్ల కొందరు ప్రేక్షకులు థియేటర్స్‌ వెళ్లకుండా వాయిదా వేసుకుంటారు. కాబట్టి మీరు పెట్టిన పోస్టులు, వీడియోలు అన్ని డిలీట్‌ చేయండి" అంటూ విశ్వక్‌ కోరాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.