శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 మే 2022 (14:33 IST)

విశ్వక్ సేన్‌కి మద్దతిచ్చిన నటి కరాటే కళ్యాణి

karate kalyani
విశ్వక్ సేన్, ప్రముఖ యాంకర్ దేవి నాగవల్లి మధ్య జరిగిన వాగ్వాదం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే ఈ తప్పొప్పుల సమీకరణాల్లో మద్దతు మాత్రం విశ్వక్‌ సేన్‌కే లభిస్తోంది.

నెటిజన్లు విశ్వక్ సేన్‌కి మద్దతు ప్రకటిస్తూ టీవీ 9 ఛానల్‌పై.. షో నిర్వహించిన యాంకర్‌పై విరుచుకుపడుతున్నారు.
 
ఈ నేపథ్యంలో సినీ నటి కరాటే కళ్యాణి విశ్వక్ సేన్‌కి మద్దతు ప్రకటిస్తూ తన ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టి.. ఈ ఇష్యూలోకి యాంకర్ అనసూయని లాగేసింది.

''3*3 టీవీ వర్సెస్ సేన్‌లో పూర్తిగా టీవీ వాళ్లదే తప్పు. నేను ఆ హీరోకే సపోర్ట్ చేస్తా. అనసూయ ఎన్నిసార్లు F** పదం వాడినప్పుడు నువ్వు రోడ్డు మీద డాన్స్ చేసినప్పుడు ఏమైంది అమ్మ?'' అంటూ చురకలు అంటించింది కరాటే కళ్యాణి.
 
నువ్వే కాదు మేం కూడా విశ్వక్ సేన్‌కే మద్దతు ప్రకటిస్తున్నాం అంటూ నెటిజన్లు కళ్యాణి పోస్ట్‌పై స్పందిస్తున్నారు.