శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 6 జనవరి 2022 (17:37 IST)

శింబు మానాడు రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న సురేష్ ప్రొడక్షన్స్

Suresh Productions
తమిళంలో సూపర్ హిట్ అయిన మానాడు సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్‌తో పాటు అన్ని భాషల రీమేక్ హక్కులను సురేష్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. తెలుగు వర్షన్ సినిమాకు ఏసియన్ సినిమాస్ కూడా భాగస్వామ్యం వహించనుంది.
 
శింబు, కళ్యాణి ప్రియదర్శన్ హీరో హీరోయిన్లుగా ఎస్ జే సూర్య ప్రతినాయకుడిగా నటించారు. ఈ సై ఫై థ్రిల్లర్‌ను వెంకట్ ప్రభు తెరకెక్కించాడు. సినిమా కాన్సెప్ట్ 'టైమ్ లూప్' చుట్టూ తిరుగుతుంది, ఇక్కడ ఒక నిర్దిష్ట విషయం జరిగే వరకు జీవితంలో ఒక నిర్దిష్ట కాలం లూప్‌లో పునరావృతమవుతుంది. 
 
సురేష్ కామాక్షి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 25న విడుదలైంది. 2021 అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా కోలీవుడ్‌లో రికార్డులు క్రియేట్ చేసింది.
 
మానాడును మిగతా భాషల్లో సురేష్ ప్రొడక్షన్ రీమేక్ చేయనుంది. దానికి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.