శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 22 నవంబరు 2021 (08:44 IST)

మ‌నాడు కోస‌మే 27 కిలోల బరువు త‌గ్గా - ఫంక్ష‌న్‌లో ఎమోష‌న‌ల్ కావ‌డానికి కార‌ణం అదే -శింబు

Simbhu
తెలుగు వారికి `మన్మధ, వల్లభ` చిత్రాలతో ప‌రిచ‌య‌మైన త‌మిళ న‌టుడు శింబు. వి.హౌస్ ప్రొడక్షన్ పతాకంపై సాయిసన్ శింబు, యస్.జె.సూర్య, కల్యాణి ప్రియదర్శిని నటీనటులుగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో  సురేష్ కమాట్చి నిర్మించిన తమిళ్ చిత్రం "మానాడు" ను తెలుగులో "ది లూప్‌" పేరుతో డబ్బింగ్ చేశారు. తెలుగులో గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అల్లు అరవింద్, బన్ని వాసులు గ్రాండ్ గా 25న విడుదల చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన సందర్భంగా హీరో సాయిసన్ శింబు హైద‌రాబాద్‌లో చిత్రం గురించి ఇలా తెలియ‌జేశారు.
 
- వెంకట్ ప్రభు అద్భుతమైన దర్శకుడు.తను తీసే విధానం చాలా బాగుంటుంది.తను చెప్పిన కథ, స్క్రిప్ట్ నచ్చి ఈ సినిమా చేస్తున్నాను.పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో యస్.జె  సూర్య గారికి నాకు ఈ సినిమాలో టామ్ & జెర్రీ లాంటి సీన్స్ ఉంటాయి.ఈ చిత్రంలో నేను హంతకుడి పాత్రను పోషిస్తుండగా, ఎస్‌జె సూర్య  పోలీసు ఆఫీసర్ గా నటిస్తున్నాడు. 
 
- టైం లూప్ అనేది ఒక్క రోజులోనే జరుగుతుంది.. కానీ వేరే వేరే టైమ్స్ లో జరిగే స్టోరీ ఇది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాకు నిర్మాతలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మేమంతా ఈ సినిమా కొరకు చాలా కష్టపడి పని చేశాము.కథ డిమాండ్ మేరకు ఈ సినిమా కోసం 27 కిలోల బరువు తగ్గాను.
 
- ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు నెక్స్ట్ ఎం జరుగుతుంది అనే క్యురియాసిటీ కలిగిస్తుంది.ఇందులో ఫైట్స్ హైలెట్ గా నిలుస్తాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. 
 
- సినీ ప్ర‌యాణంలో ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కొన్నా. ఈ సినిమాను తీసుకురావ‌డానికి మూడేళ్ళు ప‌ట్టింది. పొలిటిక‌ల్ సినిమా తీస్తున్నాను అన‌గానే రాజ‌కీయ ఒత్తిడులు వ‌చ్చాయి. నిర్మాణ‌ప‌రంగా ఒక ద‌శ‌లో సినిమా ఆగిపోయింది. అవ‌న్నీ నాపై నింద‌ల పేరుతో కొంద‌రు దాడిచేశారు. ఇవ‌న్నీ ప్రీ రిలీజ్‌లో గుర్తుకు రావ‌డంతో క‌న్నీళ్ళు ఆగ‌లేదు.. బాగా ఎమోష‌న‌ల్ అయ్యాను. స‌ర‌దాగా సాగే ఫంక్ష‌న్‌లో ఒక్క‌సారిగా అలా జ‌ర‌గ‌డం నాకూ ఆశ్చ‌ర్యం క‌లిగింది
 
- జర్నలిస్ట్ లు అందరూ మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అంటే.. మీరే మంచి పిల్లను చూసి చెపితే చేసుకుంటాను అన్నారు (నవ్వుతూ)..ఇందులో హీరోయిన్ ఉన్నా కూడా కథలో భాగంగా వస్తుంది. అంతేగానీ తనతో నాకు లవ్ ట్రాక్ ఉండదు. ఒకటే సాంగ్ ఉంటుంది.ఇంకొకటి థీమ్ సాంగ్ ఉంటుంది. 
- సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా  మన్మధ, వల్లభ సినిమాలకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు.తను గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ .ఇప్పుడు తను చేస్తున్న ఈ సినిమాలో పాటలకు ఎక్కువ స్కోప్ లేదు కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంది.
 
- కరోనా కారణంగా తెలుగులో గ్యాప్ వచ్చింది.ఇక నుండి నా ప్రతి సినిమాను తెలుగులో డబ్ చేస్తాను.. అలాగే మంచి కథ దొరికితే తెలుగులో స్ట్రెయిట్ ఫిల్మ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను.నా సినిమాను తెలుగులో అల్లు అరవింద్, బన్ని వాసు గార్లు విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది వారికి నా  ధన్యవాదాలు 
కొత్త సినిమాలు
ఈ సినిమా తరువాత గౌతమ్ మీనన్ తో మూడవ సారి సినిమా చేస్తున్నాను. ఇది తెలుగులో విడుదల అవుతుంది. గౌతమ్ కార్తీక్ తో కన్నడ రీమేక్  ఒక సినిమా చేస్తున్నాను.ఈ రెండు సినిమాలకు కూడా ఏ.ఆర్. రహమాన్ గారు మ్యూజిక్ ఇస్తున్నారు.అలాగే గోకుల్ డైరెక్షన్ లో కరోనా పేసెంట్ గా "కరోనా కుమార్" మూవీ చేస్తున్నాను.ఇది వెరీ ఫన్నీ లవ్ స్టోరీ చేస్తున్నాను అని ముగించారు.