ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 30 జూన్ 2021 (17:57 IST)

భిన్న‌మైన పాత్ర‌లో హ‌న్సిక `మ‌హా

Hansika
హన్సిక మొత్వాని 50 వ చిత్రం 'మహా' కొంతకాలంగా తయారవుతోంది. ఈ చిత్రంలో శింబు అతిధి పాత్రలో నటించినట్లు తెలిసింది. ఈ చిత్రానికి దర్శకుడిగా యు.ఆర్.జమీల్ ప‌రిచ‌యం అవుతున్నారు. ఆయేనే ఈ క‌థ‌ను రాశారు. ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ లేదా డైరెక్ట్ OTT రిలీజ్ అని మేకర్స్ ఆలోచిస్తున్నారు. ముందుగా టీజ‌ర్‌ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్ర టీజర్ జూలై 2 న సాయంత్రం 6 గంటలకు విడుదల కానున్నట్లు ప్రకటించారు.
 
ఇందులో హ‌న్సిక పాత్ర చాలా భిన్న‌మైన‌దిగా క‌నిపిస్తోంది. గంజాయ్ తాగే సంద‌ర్భంలోనూ ఆమె న‌టించింది. మ‌రోవైపు చిత్ర‌మైన గెట‌ప్‌ను కూడా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. త‌ను పేప‌ర్ చూస్తుండ‌గా కాలిపోయిన‌ట్లుగా వుండేవిధంగా తీర్చారు. ఇది ద‌ర్శ‌కుడు క్రియేటివ్‌కు నిద‌ర్శ‌న‌మ‌ని చిత్ర యూనిట్ చెబుతోంది. దాదాపు రెండేళ్ళ‌నుంచి ఈ సినిమా షూట్‌లో వుంది. ఎట్సెటెరా ఎంటర్టైన్మెంట్ పతాకంపై మాథి అజగన్ నిర్మించిన 'మహా'లో సనమ్ శెట్టి, తంబి రామయ్య, కరుణకరన్, మహాత్ రాఘవేంద్ర, సుజిత్ శంకర్, నందిత జెన్నిఫర్, మరియు శ్రీకాంత్ నటించారు. సంగీతం జిబ్రాన్ స్వరపరిచారు, మాధి ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడు మరియు ఎడిటింగ్ జోహన్ అబ్రహం.