విశ్వక్ సేన్‌పై దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ చర్య తీసుకున్నారా (లేటెస్ట్)
సినీ హీరో విశ్వక్ సేన్ తన సినిమా 'అశోక వనంలో అర్జున కళ్యాణం' థియేట్రికల్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఫ్రాంక్ పబ్లిసిటీ చేసుకుని పాపులర్ అయ్యాడు. ఈ నేపథ్యంలో టీవీ యాంకర్ దేవి నాగవల్లితో మాటల వాగ్వివాదం సందర్భంగా ఫక్.. అనే పదజాలం వాడడంతో ఇవి చూసిన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టి.ఆర్.ఎస్. నాయకుడు నాగం దానేందర్‌లు విశ్వక్ సేన్‌పై చర్య తీసుకుంటామని విలేకరులకు తెలియజేశారు.
ఈ విషయమై విశ్వక్ సేన్ బుధవారంనాడు వివరణిస్తూ, దానంగారు ఓ మేరేజ్ ఫంక్షన్‌కు వెళితే అక్కడ విలేకరుల అడగడం జరిగింది. కానీ ఆయనకు పూర్తి వివరాలు తెలియవు కనుక అలా రియాక్ట్ అయ్యారు. అదేవిధంగా తలసాని గారు కూడా ఫ్రాంక్ వీడియో నేపథ్యంకానీ, ఆ తర్వాత ఏమయింది అని కానీ తెలీదు. నేను వారిని పర్సనల్‌గా కలుస్తాను అని చెప్పారు.
కాగా, జూబ్లీహిల్స్ రోడ్లపై పర్మిషన్ లేకుండా ఇలా వీడియోలు చేయడం నిషేధం అని కొందరు మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పరుషపదజాలం వాడిన విశ్వక్‌సేన్‌పై చర్య తీసుకోవాలని దేవి మంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పటికే రెండు రోజులు అయిన ఈ సంఘటన తర్వాత ఈరోజే తాను చాలా ఫ్రీగా వున్నానని, భవిష్యత్‌లో ఇలాంటి ఫ్రాంక్ వీడియోలు చేయనని అనడం విశేషం. ఈ శుక్రవారమే ఆయన సినిమా విడుదలకాబోతుంది.