శనివారం, 2 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 మే 2022 (16:38 IST)

హీరో విశ్వక్ సేన్‌పై టీవీ యాంకర్ దేవి నాగవల్లి ఫిర్యాదు

Vishwak sen
హీరో విశ్వక్ సేన్ తన అప్ కమింగ్ ఫిల్మ్ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఓ ప్రాంక్ వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఈ ప్రయత్నం బెడిసికొట్టింది. టీవీ9 స్టూడియోలో యాంకర్ దేవితో సంభాషిస్తున్నప్పుడు 'ఎఫ్' అనే పదాన్ని వాడడం కలకలం రేపింది. 
 
ఈ వివాదం నేపథ్యంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను యాంకర్ దేవి, జర్నలిస్టు ఫోరమ్ సభ్యులు కలిసి నటుడు విశ్వక్ సేన్ తీరు, ఆయన క్షమాపణలు చెప్పిన విధానంపై ఫిర్యాదు చేశారు. 
 
ఈ ఫిర్యాదును స్వీకరించిన తర్వాత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, హీరో విశ్వక్ సేన్ ప్రవర్తన సభ్యతగా లేదన్నారు. ఈ విషయంపై చలనచిత్ర అభివృద్ధి మండలి, పోలీసులతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకుని, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.