బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 ఏప్రియల్ 2022 (14:03 IST)

ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డ్: పీకేను బ్రేక్ చేసింది..

ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రాబడుతోంది. బాహుబలి తర్వాత వస్తున్న రాజమౌళి సినిమా కావడంతో ట్రిపుల్‌ఆర్‌పై మొదటి నుంచి భారీ హైప్ నెలకొంది. ఇంకా చెర్రీ, ఎన్టీఆర్ మల్టీస్టారర్ కావడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 
 
'ఆర్ఆర్ఆర్' మూవీ. మార్చి 25న ప్యాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మళయాళ భాషల్లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ మరో రికార్డు క్రియేట్‌ చేసింది.
 
అత్యధిక కలెక్షన్స్‌ చేసిన ఇండియన్‌ సినిమాల్లో 5 వ మూవీగా రికార్డుల్లోకి ఎక్కింది ఆర్‌ఆర్‌ఆర్‌. మొదటి స్థానంలో దంగల్, రెండో స్థానంలో బాహుబలి2, మూడో స్థానంలో బజరంగీ భాయిజాన్, నాలుగో స్థానంలో సీక్రెట్ సూపర్ స్టార్ ఉంది. తాజాగా పీకే రికార్డును బ్రేక్‌ చేసి ఆర్ఆర్‌ఆర్ మూవీ 5వ స్థానంలో నిలిచింది.