ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 ఏప్రియల్ 2022 (12:49 IST)

సీఎం జగన్ ఆకస్మిక హస్తిన టూర్ - రేపు ప్రధానితో భేటీ

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. అదే రోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆయన సమావేశంకానున్నారు. సీఎం జగన్‌కు పీఎంవో వర్గాలు అపాయింట్మెంట్‌ను ఖరారు చేసినట్టు సమాచారం. 
 
అయితే, సీఎం జగన్ చేపట్టి హస్తిన పర్యటన, ప్రధాని మోడీతో జరిగే సమావేశంలో ఏయే అంశాలు చర్చకు వస్తాయన్న అంశంపై ఇప్పటివరకు ఓ క్లారిటీ లేదు. ముఖ్యంగా, వైకాపా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి, ఏప్రిల్ 4 నుంచి ఆ జిల్లాల్లో పాలన కూడా ప్రారంభమైంది. 
 
ఈ విషయాన్ని ప్రధాని మోడీకి వివరించి, రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరితగతిన విడుదల చేయాల్సిందిగా కోరే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. తమ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల కోసం కనీసం అప్పుల రూపంలో అయినా నిధులు ఇప్పించేలా సహకరించాలని ప్రధాని మోడీని కోరే అవకాశం ఉంది. అలాగే, అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మరోమారు ప్రధానిని సీఎం జగన్ కోరనున్నారు.