శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 ఏప్రియల్ 2022 (09:59 IST)

మారిన ఏపీ సమగ్ర స్వరూపం : కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర స్వరూపం మారిపోయింది. ఇప్పటివరకు ఉన్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఈ కొత్త జిల్లాల్లో సోమవారం నుంచి పాలన ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. 
 
లోక్‌సభ నియోజకవర్గం ప్రామాణికంగా చేసుకుని ఈ కొత్త జిల్లాలను ఏర్పాటుచేశారు. అయితే, ఒక్క లోక్‌సభ స్థానాన్ని మాత్రం రెండు జిల్లాలుగా విభజించారు. దీంతో ఏపీలో ఇక నుంచి 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లలో కార్యకలాపాలు కొనసాగనున్నాయి. 
 
ఏపీలో 42 యేళ్ల తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. సోమవారం ఉదయం 9.05 గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్లు బాధ్యతలు స్వకరించారు. ఆ తర్వాత ఇతర శాఖల జిల్లా అధికారులు చేపట్టారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం బలంగా భావిస్తుంది.