బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (14:59 IST)

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఏంటది?

WhatsApp Pay
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్. వాట్సాప్ యూజర్లను ఆకట్టుకునే రీతిలో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. తద్వారా 2జీబీ వరకు ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు. అంటే.. ఫైల్ షేరింగ్ ఆప్షన్ ద్వారా మీరు ఏదైనా ఫైల్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు లేదా ఆయా ఫైళ్లను వాట్సాప్ సర్వర్లకు అప్ లోడ్ చేసుకోవచ్చు. 
 
అందుకు పట్టే ఎస్టిమేటెడ్ టైమ్ ఈ కొత్త ఫీచర్ డిస్ ప్లే చేస్తుంది. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్, డెస్క్‌టాప్ బీటా వెర్షన్ అప్‌డేట్స్‌లో మాత్రమే ఫీచర్‌ను యాడ్ చేసింది వాట్సాప్.
 
వాట్సాప్ బీటా ఇన్ఫో నివేదిక ప్రకారం… యూజర్లు ఏ ఫైల్‌ను అప్‌లోడ్ చేయడం గానీ డౌన్‌లోడ్ చేసినప్పుడు ఫైల్ లోడింగ్ ఎస్టిమేటెడ్ టైమ్ ఎంతసేపు ఉంటుందో ఫీచర్ చూడొచ్చు. 
 
ఎంతసేపు డౌన్‌లోడ్ అవుతుందో ఈ ఫీచర్ టైమింగ్ కౌంట్ చూపిస్తుంది. కొత్తగా 2GB ఫైల్ షేరింగ్ ఆప్షన్ ద్వారా లార్జ్ ఫైల్స్ క్షణాల వ్యవధిలో షేర్ చేయొచ్చు.