గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 31 మార్చి 2022 (09:03 IST)

నేటి నుంచి స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ బంద్

వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని మోడళ్లలో వాట్సాప్ సేవలు ఆపివేయనుంది. పాత ఓఎస్‌లతో పనిచేసే స్మార్ట్ ఫోన్లలో గురువారం నుంచి ఈ సేవలు నిలిచిపోనున్నాయి. పాత వెర్షన్‌తో కూడిన స్మార్ట్ ఫోన్లకు సేవలను నిలిపివేస్తున్నట్టు ఇది వరకే ప్రకటించింది. అందుకు అనుగుణంగాన ఈ సేవలను బంద్ చేసింది. 
 
ఫలితంగా ఆండ్రాయిడ్ 4.0, అంతకంటే తక్కువ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఇక యూపిల్ ఐఫోన్ ప్రత్యేక ఓఎస్ అయిన ఐఎస్ఓ 10 అంతకంటే పై వెర్షన్లకు మాత్రమే వాట్సాప్ సేవలు అందుబాటులో ఉంటాయి. కాయ్ 2.5 వెర్షన్ కంటే తక్కువ ఉన్న మోడళ్ళలోనూ వాట్సాప్ సేవలు ఆగిపోతాయి. 
 
వాట్సాప్ సేవలు ఆగిపోనున్న ఫోన్ల వివరాలను పరిశీలిస్తే, శాంసంగ్ గెలాక్సీ ట్రెండ్ లైట్, గెలాక్సీ ఎస్ 3 మినీ, గెలాక్సీ ఎక్స్‌కవర్, గెలాక్సీ కోర మోడళ్లలోను, ఎల్జీ ఆప్టిమస్ సిరీస్‌లో ఎఫ్3 నుంచి ఎఫ్ 7 వరకు ఆప్టిమస్ ఎల్ 3 II, ఎల్ 4 II డ్యుయల్, ఆప్టిమస్ ఎల్ II, ఎఫ్ 5 II డ్యూయల్ నుంచి ఎఫ్7 II డుయల్‌‌తో పాటు మరికొన్ని పాత వెర్షన్ ఫోన్లు ఉన్నాయి. అలాగే, మోటోరాలో, షావోయి, హువావే స్మార్ట్ ఫోన్లలోని కొన్ని మోడళ్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి.