సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 మార్చి 2022 (08:37 IST)

హైదరాబాదులో ఘోర అగ్ని ప్రమాదం : 11మంది సజీవ దహనం

హైదరాబాదులో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 11 మంది సజీవ దహనం అయ్యారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని బోయ గూడా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది నిప్పుకు బలైపోగా , మరో ఇద్దరు మంటల్లో చిక్కుకున్నట్టు సమాచారం అందుతోంది.
 
బోయ గూడా లోని టింబర్ డిపోలో… బుధ వారం వేకువ జామున భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో 11 కార్మికులు మృతి చెందారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 
 
మొత్తం ఎనిమిది ఫైరింజన్లు అక్కడికి చేరుకొని… మంటలు ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఈ ప్రమాదంలో.. మరణాల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. అంతేకాదు.. భారీగా ఆస్తి నష్టం వాటిల్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.