బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 మార్చి 2022 (12:14 IST)

ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 25మంది గాయాల పాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 
 
వివరాల్లోకి వెళితే..  కర్ణాటకలోని పావగడ పలవలహళ్లి వద్ద ఈ ఘటన జరిగింది. వైఎన్ హొసకోట నుంచి పావగడకు బస్సు వెళ్తున్న స‌మ‌యంలో అధిక వేగం కార‌ణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
 
బ‌స్సు అదుపు త‌ప్పిన వెంట‌నే బ‌స్సులోంచి చాలా మంది కింద‌కు దూకేయ‌డంతోనే మ‌ర‌ణాలు సంభ‌వించిన‌ట్లు స‌మాచారం.
 
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని పావగడలోని ఆసుప‌త్రికి తరలిస్తున్నారు. ఈ ప్ర‌‌మాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో మొత్తం 40 మంది ఉన్నారు.