శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 5 మార్చి 2022 (15:29 IST)

ఘాట్ రోడ్డుపై వెళ్తూ అదుపుతప్పి లోయలో పడ్డ కారు: ఐదుగురు మృతి

జమ్మూకాశ్మీర్ సాంబాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం కాశ్మీరు లోని సాంబా ఘాట్ రోడ్డుపై వెళుతున్నఎస్.యు.వి వాహనం అదుపు తప్పి పక్కనే వున్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

 
ప్రమాదం జరిగిన ప్రాంతానికి పోలీసులు హుటాహుటిన చేరుకున్నారు. క్షతగాత్రులకు సహాయకచర్యలు అందించారు. ఈ ప్రమాదంలో లోయలో పడిన కారు నుజ్జునుజ్జయింది. కాగా ప్రయాణికులు పంజాబ్ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.