బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 మార్చి 2022 (12:47 IST)

ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ములుగు జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురికి తీవ్రంగా గాయాలైనాయి. మృతిచెందిన నలుగురిని అజయ్ (12), కిరణ్ (16), కౌసల్య (60), ఆటో డ్రైవర్ జానీ (23)గా గుర్తించారు. 
 
వీరంతా ఆటోలో అన్నారం షరీఫ్ దర్గాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎంకు తరలించారు.